Feb 17,2023 15:45

ప్రజాశక్తి-కడియం : ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొక్కలు ఎగుమతులు, దిగుమతులు తీసుకురావాల్సిన పాలసీలు తదితర అంశాలపై ఢిల్లీ వేదికగా ఏర్పాటుచేసిన సదస్సుకు కడియం నర్సరీ అసోసియేషన్ కు సాదర ఆహ్వానం అందింది. ఈ మేరకు సదస్సులో పాల్గొన్న అసోసియేషన్ ప్రతినిధులు ఆర్మెంటల్ ప్లాంట్స్ గ్రోత్, తదితర అంశాల గూర్చి వివరించారు. అలాగే పలు విషయాలను అసోసియేషన్ ప్రతినిధులు ద్వారా కేంద్ర ప్రభుత్వ అధికారులు అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్బంగా కరోనా కాలంలో అసోసియేషన్ ద్వారా ప్రత్యేక శానిటైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడాన్ని అభినందించారు. ఇందుకు గానూ ఇండస్ట్రీలో అతి ప్రధానమైన పాత్ బ్రేకర్ గా కడియం నర్సరీ అసోసియేషన్ ను గుర్తిస్తూ దుశ్శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో పద్మ భూషణ్ ఆర్.ఎస్. పరోడా , కేంద్ర అగ్రికల్చర్ యూనియన్ కార్యదర్శి టి.మోహాపాత్ర, ఐసిఎఆర్ డిజి ప్రభాత్ కుమార్ , కేంద్ర ఉద్యానశాఖ కమీషనర్ ఏ.కే.సింగ్, పలువురు కేంద్ర ఉన్నతాధికారులు , నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లా సత్యనారాయణ, ప్రతినిధులు కొత్తపల్లి శివాజీ, బొర్సు సుబ్బారాయుడు, పాటంశెట్టి శేషుకుమార్, ధర్మాసనం శివ రామకృష్ణ, పాఠంశెట్టి శ్రీనివాసరావు, చెక్కపల్లి పోలరాజు, ఆకుల గోపాల కృష్ణ, డాక్టర్ పుల్లా రామకృష్ణ, పంతం తమ్మాజీ, సింగంశెట్టి శ్రీనివాసరావు, సుంకర గోవిందు, తాళం నరేష్, తదితరులు పాల్గొన్నారు.