Feb 25,2023 23:05

ప్రజాశక్తి-కడియం కడియం నర్సరీల్లో మొక్కలకే కాదు చెట్లకు కూడా క్రేజ్‌ ఉంది. శరవేగంగా అభివద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో చెట్ల రీ ప్లాంటేషన్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. రెడీమేడ్‌ గార్డెనింగ్‌ చేపడుతున్నారు. వారి ఆసక్తిని గమనించిన కడియం నర్సరీ రైతులు మొక్కలతో పాటు చెట్లను కూడా అందుబాటులో పెడుతున్నారు. హైదరాబాదు, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మల్టీ సిటీలకు రవాణా చేస్తున్నారు. కడియం పల్ల వెంకన్న నర్సరీ యజమాని, యువరైతు పల్ల వినరు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కొత్తగా వచ్చే దేశీ, విదేశీ మొక్కలతో పాటు పాతకాలం నాటి మొక్కలను కూడా సంరక్షిస్తారు. వాటిని అంచలంచెలుగా అభివద్ధి చేస్తుంటారు. దీనిలో భాగంగా 20 ఏళ్లుగా భూమిలో పాతుకుపోయిన ప్లమోరియా ఆల్ఫా చెట్టును రూట్‌ కెనాల్‌ ట్రీట్మెంట్‌ ద్వారా పెకలించి, స్టెమ్‌ను భద్రంగా ప్యాక్‌ చేసి హైదరాబాద్‌ తరలించారు. ఈ చెట్టును రీప్లాంటేషన్‌ విధానంలో సంరక్షించడానికి 60 రోజుల సమయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు.