ప్రజాశక్తి- రాజానగరం
రాజమహేంద్రవరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కేంద్ర గ్రంథాలయంలో శనివారం జాతీయ గ్రంథాలయ దినోత్సవం మరియు డాక్టర్ ఎస్‌ఆర్.రంగనాథన్ 131వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య కె.పద్మరాజు మాట్లాడుతూ ఎస్‌ఆర్.రంగనాథన్ గ్రంథాలయ విద్యలో నూతన ఒరవడులు తీసుకువచ్చి పాఠకులకు మరింత దగ్గరగా పుస్తకాలు మరియు సమాచార విజ్ఞనము అందుబాటులో ఉండటానికి అవసరమైన సిద్ధంతాలు రుపకల్పనచేశారని అన్నారు. ఆయన కృషిని గుర్తించిన భారతప్రభుత్వము పద్మశ్రీతో సత్కరించిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సమన్వయకర్త డా.పి.విజయనిర్మల మాట్లాడు తూ విద్యార్థులు గ్రంథాల యసేవలను ఉపయోగించు కోవలన్నారు. లైబ్రరీ అసిస్టెంట్ డా.టి.సింహాచలం మాట్లాడుతూ భారతదేశ గ్రంథాలయవిద్యలో ఎస్‌ఆర్.రంగనాథన్ కృషి కొనియాడదగినదన్నారు. ఫ్యాకల్టీ అసోసియేట్ డా.సతీష్ కుమార్ మాట్లాడుతూ గ్రంథాలయ శాస్త్రనిర్వహణలో కొత్తమేలుకువలు నేర్పి, గ్రంథాలయవిద్యలో విప్లవాత్మక మైన మార్పులు తీసుకువచ్చి సమాచార విజ్ఞానము అందుబాటులో ఉంచటానికి ఎస్‌ఆర్.రంగనాథన్ కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ డా.పి.వెేంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ డా.జ్యోతి ర్మయి, డీన్ ఎక్సామినేషన్ డా. మట్టారెడ్డి, ఆచార్య.వై. శ్రీనివాసరావు, డా కె.దీప్తి మరి యు గ్రంథాలయ సిబ్బంది విజయ కుమార్, సతీష్, దుర్గా ప్రసాద్, సూర్యకుమారి, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం : శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రాఘవ కుమారి అధ్యక్షతన ఘనంగా నిర్వహిచారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్‌ఎస్.ఆర్ రంగనాథన్ పుట్టినరోజును (ఆగస్టు12న)జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటారన్నారు. ఆయన ప్రతిపాదించిన ఐదు చట్టాల సిద్ధాంతం లైబ్రరీ వ్యవస్థను నిర్వహించే సూత్రాలను వివరిస్తుందని, ఈ చట్టాన్ని 1931లో డాక్టర్ ఎస్‌ఆర్ రంగనాథన్ యొక్క ఫైవ్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పేరుతో మొదట ప్రచురించబడ్డాయన్నారు. అవి 1.పుస్తకాల ఉపయోగం కోసం, 2.ప్రతి పాఠకుడి పుస్తకం 3.ప్రతి పుస్తకం దానిరీడర్ 4.పాఠకుని సమయాన్ని ఆదా చేయడం 5.లైబ్రరీ ఎదుగుతున్న జీవి అని తెలియజేశారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ పిఎ.ప్రియరంజని, లైబ్రేరియన్ కోఆర్డినేటర్ మరియు ఐక్యూ ఎసి కోఆర్డినేటర్ డాక్టర్ బి.అనురాధ సూర్యకుమారి, లైబ్రేరియన్ సభ్యులు కేఎస్ అన్నపూర్ణాదేవి, ఎన్.స్వాతి పాల్గొన్నారు.










