Mar 25,2023 23:43

ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఆధ్వర్యంలో శనివారం సవిస్కార 2కె23 ఫెస్ట్‌ను శనివారం ఉత్సాహంగా నిర్వహించారు. కన్వెన్షన్‌ సెంటర్‌లో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అకడమిక్‌ ఈవెంట్స్‌ భాగంగా స్పర్థా, యాడ్‌ మేడ్‌, బుల్‌ వజ్‌ బేర్‌, ప్లానో, అడ్మినార్‌, అడ్మెంటార్‌, టవర్‌ బిల్డింగ్‌, సెల్ఫీ టూరిజం, ఫన్‌ అండ్‌ మైండ్‌ గేమ్స్‌, సాంస్కతిక కార్యక్రమాలు, ర్యాంప్‌ వాక్‌ తోపాట వివిధ పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు మెడల్స్‌, సర్టిఫికెట్స్‌ అందజేసారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ మాట్లాడుతూ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని ఆయా కళాశాలలకు చెందిన మేనేజ్మెంట్‌ విద్యార్థులంతా సవిస్కార 2కె23లో హాజరై విజయవంతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రపేపర్‌ మిల్‌ జిఎం చక్రపాణి, బి.బ్రహ్మానందం, ప్రిన్సిపల్‌ ఆచార్య ఎస్‌.టేకి, డాక్టర్‌ ఎన్‌.ఉదయభాస్కర్‌, డాక్టర్‌ పి.ఉమమహేశ్వరిదేవి, డాక్టర్‌ జి.రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ ఎ.శ్రీపద్మవల్లి, డాక్టర్‌ జి.అలీస్‌ జారు, డాక్టర్‌ ఎం.రమేష్‌, డాక్టర్‌ ఎం.అమ్మిరెడ్డి, డాక్టర్‌ జె.రవిశంకర్‌, డాక్టర్‌ సత్యనారాయణరాజు, ఎం.జోహర్‌ కృష్ణ, కె.శ్రీనివాసరావు, డాక్టర్‌ శ్రావ్య పాల్గొన్నారు.