ప్రజాశక్తి-రాజానగరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రాచీన తెలుగు సాహిత్యం చారిత్రక, సామాజిక, సాంస్కతిక దక్పథాలు అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, భారతీయ భాషా సంస్థ మైసూరు, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విసి ఆచార్య జివిఆర్.ప్రసాదరాజు, భారతీయ భాషా సంస్థ మైసూరు డైరెక్టర్ ఆచార్య శైలేంద్ర మోహన్, డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య సివి.శివరామకృష్ణ, ఆచార్య ఆర్‌విఎస్.సుందరం, ఆచార్య శలాక రఘునాథశర్మ, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు తోటకూర ప్రసాద్ హాజరయ్యారు. సభాధ్యక్షులుగా ప్రిన్సిపల్ ఆచార్య ఎస్.టేకి, సంచాకులుగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్, కన్వీనర్‌గా డాక్టర్ తరపట్ల సత్యనారాయణ వ్యవహరించారు. ఈ సందర్భంగా విసి ప్రసాదరాజు మాట్లాడుతూ తెలుగు భాష అంటే తనకెంతో ఇష్టమని ఎక్కువగా తెలుగులో మాట్లాడటానికే ఇష్టపడతానని అన్నారు. దేశభాషలందు తెలుగు లెస్స అని చెప్పుకొనే మనము మన పిల్లలకు తెలుగు భాష, సాహిత్య మాధుర్యాలను తెలియజేయాలన్నారు. పురణాలలోని సంస్కతిని, మంచితనాన్ని పిలలకు చెప్పాలన్నారు. మన ప్రాంతంలో విద్యాభివద్ధికి కృషి చేసిన మల్లాడి సత్యనాయకర్ వంటి వారిని ఆదర్శంగా తీసుకుని సేవా దృక్పథాలను అలవర్చుకోవాలన్నారు. భాషపై పట్టు ఉంటేనే బాగా అర్థమవుతుందన్నారు. మూడు రోజుల సదస్సును నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. భారతీయ భాషా సంస్థ మైసూరు డైరెక్టర్ ఆచార్య శైలేంద్ర మోహన్ మాట్లాడుతూ భారతీయ సంస్కతి ఔన్నత్యాన్ని తెలిపారు. ఎంతో ప్రాచీన సంస్కతి కలిగిన భారతదేశంలో తెలుగు భాషా, సాహిత్యాలకు విశిష్ట ప్రాధాన్యత ఉందని చెప్పారు. భారతీయ భాషా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ గ్రంథాలను అనువదిస్తామని తెలిపారు. తెలుగు డిక్షనరీ, చారిత్రక గ్రంథాలను, సెమినార్లను నిర్వహిస్తూ సమాజ హితమైన సాహిత్య భాషాభివృద్ధికి కషి చేస్తామన్నారు. డిప్యూటీ డైరెక్టర్ ఆచార్య సివి.శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన తెలుగు సాహిత్యం, చారిత్రక, సామాజిక, సాంస్కతిక దృక్పథాలకు సంబంధించిన అనేక విషయాలను చర్చించారు. ఆయా భాషల్లో ఉన్న నిఘంటువుల్లోని విశేషాలను తెలిపారు. ఆచార్య ఆర్‌వి.ఎస్.సుందరం మాట్లాడుతూ మూడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అద్బుతమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. గాథాసప్తసతి కాలం నుండే తెలుగులో జానపద పాటలు ఉన్నాయని తెలిపారు. అనంతరం పలువురు మాట్లాడారు.










