Jul 16,2023 15:22

ప్రజాశక్తి-బిక్కవోలు : బిక్కవోలు గ్రామ పరిధిలో లింగాల చెరువు ఆయకట్టు లో దాదాపు 150 ఎకరాలు కాకినాడ కెనాల్  నీటి ఉధృతి కారణంగా నీట మునిగిన నారు మడులు, నాట్లును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బిక్కవోలు గ్రామ పరిధిలో లింగాల చెరువు ఆయకట్టులో దాదాపు 150 ఎకరాల పరిస్థితి మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు రైతు మాటలలో తెలుస్తుంది గత నాలుగు రోజుల క్రితం వరకు రైతులు నారు మడులు వేసుకోడానికి సాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.రెండు రోజులుగా నీరు ఓవర్ ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఓవర్ ఫ్లో ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడే రైతు చెప్పడం జరిగింది. కాలువలలో కానీ, మురుగు కాలువలలో కానీ ఎక్కడ చూసిన పెద్ద ఎత్తున గుర్రపు డెక్క కానీ, ఇతర వ్యర్థలు కానీ పేరుకు పోయాయి. వేసవి కాలoలో క్లోజ్ ఆన్ పీరియడ్ లో కూడా వాటిని క్లియర్ చేయలేదు. కనీసం ఇటీవల కాలంలో జూన్ 1వ తారీఖు నుంచి నీరు విడుదల చేశామని చెప్పినప్పటికి కూడా అనేకమార్లు ఈ ప్రాంత పరిస్థితులను ఎస్.ఈ దృష్టికి తీసుకువెళదామని ప్రయత్నం చేసిన ఆయనకు  మీటింగ్ లే తప్పించి ఆయనకు మరి క్షేత్ర స్థాయిలో ఏమి జరుగుతుందో ఆయనకు అవగాహన ఉంటుందో లేదో కానీ, మరి అవగాహన ఉన్న ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ వలన ఏమి మాట్లాడలేని పరిస్థితి వస్తుందేమో ఎవరికి అర్ధం కానీ పరిస్థితి.నిన్న రైతులు వస్తా అంటే మీటింగ్ లు అంటారు. ములుగుపోతున్నాయి అంటే మీటింగ్ లు అంటారు. ఈవేళ రైతులను ముంచే పరిస్థితి తీసుకువచ్చారు.