ప్రజాశక్తి - ఉండ్రాజవరం మానవుని మనసు నిర్మలంగా ఉంటే జీవితం సుసంపన్నం, ఆనందం అవుతుందని ఉండ్రాజవరం బౌద్ధ దమ్మ పీఠం పీఠాధిపతి భంతే అనాలయో అన్నారు. శుక్రవారం బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని బౌద్ధ ధమ్మ పీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉపన్యసించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనసును పరిశుద్ధంగా ఉంచుకునేందుకు బుద్ధుడు అష్టాంగ మార్గాన్ని బోధించినట్లు తెలిపారు. బౌద్ధ ధమ్మ పీఠం మైత్రేయ బుద్ధ విహారలో బుద్ధిస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఎపి శాఖ సంయుక్తంగా మహోత్సవాన్ని నిర్వహిస్తోందని అనాలయో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాల వికాస కేంద్రం, పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచిత బోధన అందించిన ఉపాధ్యా యులను సన్మానించారు. బూరుగుపల్లి సుబ్బారావు, మల్లిన సత్య నారాయణ, బూరుగుపల్లి కళారావు, గంటా వెంకట్రావు, చిట్టూరి ఉషారాణి, ఆళ్ల సుబ్బారావు పాల్గొన్నారు.










