Apr 23,2023 23:24

ప్రచారభేరిలో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు రాంబాబు

ప్రజాశక్తి - నిడదవోలు
నిడదవోలులోని మార్కెట్‌, అంబేద్కర్‌ చౌక్‌, చర్చిపేట ప్రాంతాల్లో ఆదివారం సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ప్రచారభేరిని నిర్వహించాయి. కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం దేశంలో ప్రతి అంగులాన్ని అదానీకి అప్పగిస్తూ దేశ సంపదను ధారాదత్తం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు ఇప్పటికే అదానీ సొంతం అయిపోయాయన్నారు. అయినా జగన్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ద్వారా దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గండి శ్రీనివాసరావు, టి.నాని, ప్రసాద్‌, అశోక్‌, అనీల్‌, సుబ్బారావు, రాము, త్రిమూర్తులు తది తరులు పాల్గొన్నారు