Feb 20,2023 23:11

ప్రజాశక్తి-గోపాలపురం మండలంలోని దొండపూడి శివారులో కొవ్వాడ కాలువ గట్టుపై ఉన్న బాల యేసు పుణ్యక్షేత్ర ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్నాయి. ఏటా ఫిబ్రవరిలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన ఈ ఆలయాన్ని 20 ఏళ్ల కిందట నిర్మించినట్టు స్థానికులు తెలిపారు. కొండపై నిర్మించిన ఈ ఆలయం పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. ఉత్సవాల సమయంలోనే కాక నిత్యం ఇక్కడకు సుదూర ప్రాంతాల నుండి అనేకమంది వస్తూ ఉంటారు.