Apr 02,2023 22:47

నేలవాలిన మొక్కజొన్న చేను

ప్రజాశక్తి - గోపాలపురం
గాలివానకు మొక్కజొన్న పంట నేలకొరిగింది. మండలంలోని ఆదివారం ఈదురుగాలులతో కూడి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మండలంలోని భీమోలులో ఇల్లు బోయిన శ్రీను, దుంపల రాంపండు, కోడి రామకృష్ణ, వింటి మురళి తదితర రైతులకు చెందిన సుమారు 200 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ప్రస్తుతం పంట పాలు పోసుకుని కండి తయారీ దశలో ఉంది. ఈ సమయంలో ఈదురుగాలులు, వర్షం రావడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నేలకొరిగిన చేలల్లో 50శాతానికిపైగా పంట పాడవుతుందని రైతులు చెబుతున్నారు. మిగిలిన గ్రామాల్లో పంట నష్టం తెలియాల్సి ఉంది. అలాగే అకాల వర్షంతో ఇటుక బట్టీల వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి ఇటుకలను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. మరోపక్క పొగాకు రైతులు పంటను కాపాడుకునేందుకు నానా తంటాఉ పడుతున్నారు. మామిడి తోటలు ప్రస్తుతం పిందెల దశలో ఉన్నాయి. వర్షంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని మామిడిరైతులు ఆందోళన చెందుతున్నారు.