Sep 15,2023 23:12

ఏర్పాట్లపై ఆరా తీస్తున్న కలెక్టర్‌ మాధవీలత

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం ప్రతినిధి
సిఎం జగన్‌ నేడు జిల్లాకు రాను న్నారు. నిడదవోలులో నిర్వహించే వైఎస్‌ఆర్‌ కాపునేస్తం రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గోనున్నారు. సిఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయ కర్త తలశిల రఘురాం పేర్కొన్నారు. శుక్రవారం సయింట్‌ అంబ్రోస్‌ ఉన్నత పాఠశాల గ్రౌండ్‌ లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏర్పాట్లను వారు పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధికా రులకు నిర్దేశించిన విధులు నిర్వర్తించే క్రమంలో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణంలో వివిధ గ్యాలరీలను ఏర్పాటు చేశామన్నారు. సిఎం కార్యక్రమాల సలహాదారు, ఎంఎల్‌సి తలశిల రఘురాం మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు సార్లు జిల్లాలో సిఎం పర్యటనను విజయవంతం చేశామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, ఒఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తదితర ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోవాలన్నారు. సిఎస్‌ అనంత శ్రీరాములు పలు సూచనలు చేశారు. ఎస్‌పి పి.జగదీష్‌, ఎంపీ మార్గాని భరత్‌, ఎంఎల్‌ఎ జి.శ్రీనివాస్‌నాయుడు, జెసి తేజ్‌ భరత్‌, రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ కె.దినేష్‌కుమార్‌, నిడదవోలు మున్సిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ తదితరులు వారి వెంట ఉన్నారు.