ప్రజాశక్తి - కడియం
కడియం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న చుక్కల రమణ కుమారుడు సూర్యకుమార్ జైళ్ల శాఖ డిఎస్‌పిగా ఉద్యోగం సాధించాడు. ప్రభుత్వ కొలువును లక్ష్యంగా పెట్టుకున్న సూర్యకుమార్ రూ.లక్షల్లో జీతం వచ్చే ఇన్ఫోసిస్ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. పట్టుదలతో పోటీ పరీక్షలను ఎదుర్కొని, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందాడు. అయినా సంతృప్తి చెందని కుమార్ తండ్రి పని చేస్తున్న పోలీస్ శాఖలో ఉద్యోగం పొందాలనుకున్నాడు. దీనికోసం కృషి చేశాడు. గ్రూపు-1లో ర్యాంక్ సాధించాడు. జైళ్ల శాఖలో డిఎస్‌పిగా కొలువు సాధించినప్పటికీ సివిల్స్‌లో ముందుకెళ్లి ఉన్నత స్థానాన్ని చేరుకుంటానని సూర్యకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సూర్యకుమార్‌ను అభినందించారు.










