ప్రజాశక్తి - యంత్రాంగం
తన దీక్ష చంద్రబాబు నాయుడుకోసమో, తన కుటుంబం కోసమో కాదని రాష్ట్ర ప్రజల కోసమని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై 'సత్యమేవ జయతే' పేరుతో తలపెట్టిన నిరహార దీక్షలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు దీక్షలో పాల్గొన్నట్లు తెలిసింది. చంద్రబాబు ఆరోగ్య పరీస్థితుల రీత్యా వైద్య బృందాన్ని జైలు అధికారులు అందుబాటులో ఉంచినట్లు సమాచారం. దీక్షా శిబిరానికి వెళ్ళే ముందు చంద్ర బాబు సతీమణి నారా భువనేశ్వరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దీక్షాలో కూర్చున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.10 గంటలకు వరకు దీక్ష చేపట్టారు. చిన్న పిల్లల చేతుల మీదుగా నిమ్మరసం అందజేసి 5.10 గంటలకు దీక్ష విరమింపచేశారు. టిడిపి మహిళా నేతలు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జనసేన మహళా నేతలు భువనేవ్వరికి తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ ప్రజలకు జరుగుతున్న అన్యాయం కోసం నేను దీక్ష చేశాను. ఇప్పుడు చెపుతున్నాను. చంద్రబాబు ప్రజల మనిషి.....ఆయన నా ఆయుష్షు కూడా పోసుకుని జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఏ జ్యోతుల నెహ్రూ, మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్న పనేని రాజకుమారి, సిపిఐ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తదితరులు సంఘీభావం తెలిపారు. పెరవలి మండలంలోని తీపర్రు గ్రామంలో టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు సత్యగ్రహ దీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కె.సూర్యనా రాయణ, ఎన్.నారాయణ రావు, కె. సత్యనా రాయణ, ఎన్.సోమరాజు, కె. జనార్ధనరావు, డి.సత్యనారాయణ, కె.వెంకట రత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. సీతానగరం. మండ లంలోని పురుషో త్తపట్నంలో గాంధీ జయంతి సందర్భంగా చంద్రబాబు అరెస్టును ఖం డిస్తూ టిడిపి యూనిట్ ఇన్‌ఛార్జ్ మండ రాంబాబు ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి క్లస్టర్ ఇన్‌ఛార్జ్ గద్దే సురేష్, జనసేన మండల కన్వీనర్ విజరు శంకర్ సత్యాగ్రహ దీక్షకు మద్దతు తెలిపారు. గోపాలపురం మండలంలోని చిట్యాల గ్రామంలో చంద్రబాబు సత్యాగ్రహ దీక్షకు మద్ధతుగా సత్యాగ్రహ దీక్షను నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ మద్దిపాటి వెంకట్రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్బంధకాండను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో గద్దె హరిబాబు, నూతంగి దొరబాబు, మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గోకవరం చంద్రబాబు సత్యాగ్రహ దీక్షకు సంఘీభావంగా టిడిపి శ్రేణులు కాగడాల ప్రదర్శన చేశారు. టిడిపి రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడపా భరత్‌బాబు సారధ్యంలో మండలంలోని కామరాజుపేటలో కాగడాలు చేతబూని ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడపా వెంకట్రావు, ఎంపిటిసి అడపా సుహాసిని పాల్గొన్నారు.










