ప్రజాశక్తి - యంత్రాంగం
దేశభక్తిని పెంపొందించేందుకే నా భూమి - నాదేశం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని పలువురు నాయకులు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం పిడింగొయ్యి, హుకుంపేట కార్యాలయంలో నా మట్టి నా దేశం కార్యక్రమంలో వైసిపి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. మొక్కలు నాటి, శిలాఫలకంను ఆవిష్కరించారు. ఈసందర్బంగా చందన నాగేశ్వర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపిడిఒ డి.శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు ఎం,రూప్‌చంద్, జి.వెంకటరావు, ఎపిఒ బి.వెంకటసత్యవతి తదితరులు పాల్గొన్నారు. గోకవరంలో సర్పంచ్ బత్తుల శ్రీను ఆధ్వర్యంలో నా భూమి- నా దేశం కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి సుంకర శ్రీవల్లి పాల్గొన్నారు. కొబ్బరి మొక్కలను నాటారు. నాభూమి నాదేశం నేలతల్లికి వందనం వీరులకు వందనం కార్యక్రమాన్ని శిలాఫలకాన్ని ఎంపిపి ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సుంకర వీరబాబు, తోలేటి రాంప్రసాద్, ఎంపిడిఒ పద్మజ్యోతి, ఇఒపిఆర్‌డి ఎం.రాజేశ్వరరావు పాల్గొన్నారు. చాగల్లులో సర్పంచ్ ఉన్నమట్ల మనశ్శాంతి ఆధ్వర్యంలో నా భూమి- నా దేశం కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపిడిఒ బొలిశెట్టి రాంప్రసాద్, తహశీల్దార రాజ్యలక్ష్మి పాల్గొని కొబ్బరి మొక్కలను నాటారు. శిలాఫలకాన్ని సర్పంచ్ మనశ్శాంతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎల్.రవికుమార్, వార్డు సభ్యులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు. పెరవలిలో వేమవరం సర్పంచ్ మండ హైమవతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎంపిపి కార్చెర్ల సీతారామ ప్రసాద్ పాల్గొన్నారు. గాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపిడిఒ డి.దామోదరారావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఉండ్రాజవరం మండలంలో వివిధ గ్రామాల్లో నా భూమి నా దేశం శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, సర్పంచ్‌లు మెండే వెంకటరావు, ఈడుపుగంటి సత్యనారాయణ, గురజర్ల వీరవెంకటసత్యనారాయణ, కరుటూరి నరేంద్రబాబు ఎంపిడిఒ జివిఎస్‌కె.రాజు, కార్యదర్శి కె.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.










