ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : రాజమండ్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రక్కన గల టిడ్కో గృహాల సముదాయంలో మెగా మెడికల్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రూరల్ కోఆర్డినేటర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్. టిడ్కో గృహాల సముదాయం సి బ్లాక్ కమిటీ అధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ల బృందంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ఇక్కడ నివసించే అందరూ సద్వినియోగం చేసుకోవాలని చందన తెలిపారు. ఆరోగ్యమే మహా భాగ్యం అనే పదంలో ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రతీ ఒక్కరూ గమనించ వలసిన అవసరం ఉందని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది అని, అందుకే మన రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా రెండు విషయాల మీద శ్రద్ద తీసుకున్నారు, ఒకటి ఆరోగ్యం, రెండోది చదువు... దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ఆరోగ్య శ్రీ పథకం ఇప్పుడు మన జగనన్న రెండు అడుగులు ముందరకు వేసి ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు.










