Apr 09,2023 23:16

ముస్లిములతో కలిసి విందు చేస్తున్న కుందుల

ప్రజాశక్తి - నిడదవోలు
టిడిపి నిడదవోలు నియోజక వర్గ నాయకులు కుందుల వీరవెంకటసత్యనారాయణ ముస్లిములకు ఆదివారం ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. గణపతి సెంటర్‌ వద్ద ఉన్న పెద్ద మసీదులో ముస్లిములతో కలిసి ఆయన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ మాజీ అధ్యక్షులు గూడపాటి వెంకట్రావు, తెలుగుయువత పట్టణ మాజీ అధ్యక్షులు ఎస్‌కె.బాబు, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పేరూరి సాయిబాబా, నాయకులు వాకలపూడి వెంకటరత్నం, కె.లీలాకుమార్‌, ఎం.శ్రీనివాస్‌, ఎం.రాధా, జి.శ్రీనివాస్‌, కె.నరేష్‌, ఎ.శివ పాల్గొన్నారు