బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని, మృతుని కుటుంబానికి రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ చేశారు. జెఎన్ రోడ్డు, షిర్డి సాయి మార్గంలో డ్రెయినేజీ నిర్మాణం కోసం తీసిన గోతిలో వ్యక్తి జారిపడి మతి చెందిన ఘటనపై ఆయన మాట్లాడారు. నగరపాలక సంస్థ అభివృద్ధి పనులు పేరుతో చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుందన్నారు. దీని కారణంగానే డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి చెందాడన్నారు. ఈ ఘటన నగరపాలక సంస్థ నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. పనులు నిర్మాణ దశలో ఉన్న సమయంలో దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవ డంలోనూ అధికారులు విఫలమయ్యారన్నారు. కనీసం హెచ్చరిక బోర్డులనూ నగర పాలక సంస్థ ఏర్పాటు చేయలేదని అన్నారు. చిన్న చిన్న రోడ్లలోనూ డివైడర్లు నిర్మిస్తున్నారన్నారు. సోమవారం ప్రమాదం జరిగిన ప్రాంతం రోడ్డులోకి అగ్నిమాపక యంత్రం కూడా వెళ్లలేని పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. అభివృద్ధి పేరుతో చేస్తున్న పనులు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయన్నారు. ఈ ఘటనకు పూర్తి బాధ్యత నగరపాలక సంస్థ వహించాలని డిమాండ్ చేశారు. మతుని కుటుంబానికి సిపిఎం న ప్రగాడ సానుభూతిని తెలియజేస్తుందన్నారు. మతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టి, భవిష్యత్తులో ఎలాంటి పనులు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, నాయకులు ఐ.సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.










