Jun 11,2023 22:51

ప్రజలతో మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా

ప్రజాశక్తి - సీతానగరం
మండలంలోని ముగ్గళ్లలో ఆదివారం గడప గడపకూ మనప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజా నగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఇంటింటా పర్యటించిన ప్రభుత్వ పథకాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రాజా మాట్లాడారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవ్వడంతో ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో గ్రామంలో రూ.5.70 లక్షలతో మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయన్నారు. వైసిపి నాలుగేళ్ల పాలనలో రూ.3.91 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. జగనన్న పాలనలో ప్రభుత్వ సేవలు నేరుగా ఇంటి వద్దకే వాలంటరీ వ్యవస్థ ద్వారా వస్తున్నాయన్నారు. గ్రామంలో అవసరమైన చోట డ్రెయినేజీలు నిర్మిస్తామన్నారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుర్రాల జ్యోత్స్న, వైసిపి మండల కన్వీనర్‌ గంటా శ్రీను, మండల కో-కన్వీనర్‌ కరుటూరి హరిబాబు, సేవాదళ్‌ అధ్యక్షులు డాక్టర్‌ బాబు, విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు చంటిబాబు, సుజీ రాజు, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.