ప్రజాశక్తి-నల్లజర్ల రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్ర నష్టాలకు గురైన రైతాంగాన్ని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి దొడ్డిగర్ల సువర్ణ రాజు అన్నారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం నల్లజర్ల మండలంలో అనంతపల్లి, చోడవరం గ్రామాల్లో పర్యటించారు. మొక్క జొన్న రైతులను పరామర్శించిన సువర్ణ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేని పక్షంలో జనసేన పార్టీ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు.










