ప్రజాశక్తి-యంత్రాంగం
జిల్లాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరం స్థానిక పివి నరసింహారావు పార్కు (గోదావరి బండ్) ఆవరణలో అల్లూరి సీతారామరాజు విగ్రహాని డాక్టర్ కె.మాధవీలత తదితరులు పూలమాలలువేసినివాళులర్పించారు. అల్లూరి సీతారామరాజు చదువుకున్న ఉల్లితోట బంగారయ్య మున్సిపల్ స్కూలులో ఒక బ్లాక్ కు అల్లూరి పేరు పెడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్‌కె.మాధవీలత అన్నారు. గోదావరి గట్టున జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఏర్పాటు చేసిన అల్లూరి విగ్రహం వద్ద జరిగిన అల్లూరి సీతారామరాజు వ జయంతి ముగింపు ఉత్సవంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక గోరక్షణపేట జంక్షన్లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు పడాల రామారావు స్మారక స్థూపం వద్ద ఉన్న అల్లూరి విగ్రహాం వద్ద జయంతి ముగింపు ఉత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం కార్యదర్శి చీకట్ల శివన్నారాయణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చాగల్లు మండలంలో చాగల్లు శాఖ గ్రంథాలయంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. గోకవరం ఎలక్ట్రికల్ యూనియన్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి నిర్వహించారు. జగ్గంపేట ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు, వైసిపి ఉభయ గోదావరి జిల్లాల యువజన విభాగం కో ఆర్డినేటర్ జగ్గంపూడి గణేష్ తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉండ్రాజవరం వడ్లూరు, వెలగదుర్రు గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు జయంతిని నిర్వహించారు. సీతానగరం అల్లూరి సీతారామరాజు జయంతిని సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యులు పలివెల వీరబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. నాలుగు బొమ్మలు కూడలిలో మరియు మండల కేంద్రంలో, చినకొండేపూడి గ్రామంలో ఉన్న అలూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళలర్పించారు. నల్లజర్ల దూబచర్ల గ్రామంలో అల్లూరి సీతారామరాజు జయంతిని లయన్స్ క్లబ్స్ దూబచర్ల ఆధ్వర్యంలో ఆజాది కా అమత మహౌత్సవం లో భాగంగా సంఘమిత్ర విద్యాలయ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన్యంలో 35 సంవత్సరాలుగా విద్యా సేవలు అందించిన పులలపాడు గ్రామానికి చెందిన అల్లూరి రామచంద్రరావు మాస్టారుని సత్కరించారు తాళ్లపూడి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా పాఠశాలలో అల్లూరితోపాటు భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద, జాతీయ పతాకం నిర్మాత పింగళి వెంకయ్య చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.










