ప్రజాశక్తి -దేవరపల్లి, నిడదవోలు మణిపూర్‌లో గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారాలపై దోషులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం దేవరపల్లి బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఐటియు మండల గౌరవాధ్యక్షురాలు టిపి.లక్ష్మి, మండల కార్యదర్శి ఎస్.భగత్, రైతు సంఘం నాయకులు ఉండవల్లి కష్ణారావు, పప్పు రామారావు మాట్లాడారు. సిఐటియు నాయకులు కె.రత్నాజీ, అయినపర్తి శ్రీనివాసరావు, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లిపూడి వెంకటలక్ష్మి, రైతు సంఘం నాయకులు పిన్నమనేని సత్యనారాయణ, భవన నిర్మాణ సంఘం నాయకులు గ్యాలం సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్స్ నాయకులు సిర్రారవి, కె.పద్మ, కామేశ్వరి, సిర్రా ఝాన్సీ, మడిల్లి రామారావు, పుల్లూరు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నిడదవోలులో యుటిఎఫ్, సిఐటియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ మతం ముసుగులో హిందూ ఉన్మాదులు బిజెపి ప్రభుత్వం ప్రోత్సాహంతో ఈ దారుణాలకు పాల్పడుతున్నారన్నారు. యుటిఎఫ్ నాయకులు ప్రదీప్ మాట్లాడుతూ మణిపూర్ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు గంటి కృష్ణ, గుమ్మాపు డానియల్, యుటిఎఫ్ నాయకులు జి.ఆనంద మోహన్, జి.శివకుమార్ కెఎన్‌విపి కుమార్, కె.సత్యనారాయణ, జి.రమేష్ బాబు, రాజు, బి.శ్రీరామ్, లిల్లీ గ్రేస్, కాంతి, మున్నిసా బేగం, రాజేశ్వరి, శ్రావణి, గంగారత్నం, స్వరూప రాణి పాల్గొన్నారు.










