May 09,2023 23:50

తల్లిదండ్రులతో సాయిశ్రీ

మణిపూర్‌ నుంచి క్షేమంగా చేరిన విద్యార్థిని
ప్రజాశక్తి- కడియం
మణిపూర్‌లో ఎన్‌ఐటి చదువుతున్న కడియం మండలం వేమగిరికి చెందిన మద్దెల యశస్వినిసాయిశ్రీ మంగళవారం క్షేమంగా ఇంటికి చేరింది. ఆమె ఎన్‌ఐటిలో ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమార్తె ఎలా ఉందో తెలీక తల్లిదండులు వెంకటరామకృష్ణ, శోభారాణి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రత్యేక విమానాల ద్వారా అక్కడ విద్యార్థులను హైదరాబాదు తీసుకొచ్చారు. అక్కడినుంచి బస్సులో ఆయా ప్రాంతాలకు తరలించారు. సాయిశ్రీ క్షేమంగా చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.