Aug 02,2023 00:24

ప్రజాశక్తి-యంత్రాంగం
మణిపూర్‌ దమనకాండపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మణిపూర్‌ ఘటనలపై జిల్ల్లాలో మంగవారం పలువురు నిరసన తెలిపారు.
దేవరపల్లి : మణిపూర్‌ దమనకాండపై మండల పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో యర్నగూడెం గ్రామంలో నిరసన శాంతి ర్యాలీ నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ పాస్టర్స్‌ ఫెలోషిప్‌ చైర్మన్‌ షేక్‌ గఫూర్‌ మాట్లాడుతూ మణిపూర్‌ ఘటనల్లో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం బస్‌ స్టాండ్‌ ఆవరణలో మానవహారం నిర్వహించి రాజ్యాంగేతర శక్తులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేవరపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో మండల ఫెలోషిప్‌ అధ్యక్షులు ఇర్లపాటి డేవిడ్‌ రాజు, సెక్రటరీ శామ్యూల్‌ రాజు, ఆర్‌సియమ్‌ ఫాదర్‌ దానియేలు, ట్రెజరర్‌ శేఖర్‌ బాబు, ఎ.దానియేలు, ఎమ్‌.విల్సన్‌, జయానందబాబు, సాల్మన్‌ రాజు పలువురు పాస్టర్లు పాల్గొన్నారు. పెరవలి: మణిపూర్‌లో కొనసాగుతున్న దారుణాల పట్ల కేంద్ర, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల పాలన తీరు చాలా బాధాకరమని తూర్పు గోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అరిగెల అరుణకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ముక్కామల లో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. నిడదవోలు: మండలంలో సమిశ్రగూడెం గ్రామంలో మంగళవారం ఇటీవల మణిపూర్లో చోటుచేసుకున్న ఘటనలకు కారకులైన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ మహిళలు యువకులు డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కెవిఎస్‌ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు, కర్తేక సామ్రాజ్యం. చోళ్ళ ఇమ్మాన్యుల్‌ , పద్మావతి, రాధా, బేబీ మాణిక్యం, వెంకాయమ్మ రవికళ, రూపవాణి, విజయ లక్ష్మి, రమేష్‌, ప్రదీప్‌ కుమార్‌ తది తరులు పాల్గొన్నారు