Apr 26,2023 23:24

మంత్రి వనిత ఆదేశాలతో పోలీసు ఔట్‌ పోస్ట్‌

ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్‌ హోమ్‌, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశాలలో రాజమహేంద్రవరం-కొవ్వూరు రోడ్‌ కమ్‌ రైలు వంతెనపై పోలీసు ఔట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. రెస్కూ టీమ్‌ నిరంతరం ఈ ఔట్‌ పోస్టు వద్ద గస్తీ కాస్తున్నారు. మూడు రోజుల క్రితం (ఆదివారం) మంత్రి రాజమహేంద్రవరం పర్యటనను ముగించుకుని కొవ్వూరు క్యాంపు కార్యాలయానికి వెళుతుండగా వంతెనపై జనం గుమిగూడి ఉండడం గమనించారు. దీంతో ఆమె కారు దీగి ఏమైందని ఆరా తీశారు. అంతకు 5 నిమిషాల క్రితం ఒక వ్యక్తి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రయాణికులు మంత్రికి వివరించారు. దీనిపై మంత్రి వెంటనే స్పందించి.. వెలగపూడి సచివాలయానికి వెళ్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. వంతెనపై ప్రమాదాలను అరికట్టడానికి ఔట్‌ పోస్టు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
పదవులంటే అలంకార కాదు.. బాధ్యత
పదవులంటే అలంకార ప్రాయం కాదని, మరింత బాధ్యతను పెంచుతాయని హోమ్‌ శాఖ మంత్రి డాక్టర్‌ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో బుధవారం జరిగిన ఆసుపత్రి అభివద్ధి కమిటీ మెంబర్స్‌ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభ్యులుగా వరిగేటి సుధాకర్‌, నగళ్లపాటి శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అనంతర హోమ్‌ శాఖ ఆసుపత్రి పరిసరాలను, అన్ని వార్డులనూ పరిశీలించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. స్త్రీల ప్రసూతి విభాగంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయని మంత్రి ప్రశ్నించారు. వనిత మాట్లాడుతూ.. అందరికి వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.