ప్రజాశక్తి-చాగల్లు
స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలు లో సోమవారం జరిగిన వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ లో చేరటానికి మండల స్థాయి లో జరిగిన ఎంపిక పోటీలు నిర్వహించినట్లు సోమవారం కన్వీనర్ విజయలక్ష్మీ తెలిపారు. అశోక్ నగర్ చాగల్లుకి చెందిన విద్యార్థి సిహెచ్.భద్ర, ఊనగట్ల మండలపరిషత్ పాఠశాల కు చెందిన ఎం.అనుగ్రహ ఎంపికైనట్ల కన్వనర్ విజయలక్ష్మీ తెలిపారు. జిల్లా స్థాయి లో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు.
స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ నందు చేరేందుకు అవకాశం
గోపాలపురం ఈ విద్యా సంవత్సరం గాను డాక్టర్ వైఎస్‌ఆర్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్, కడప నందు 4 ,5 తరగతిలో ప్రవేశవుల కొరకు ఆసక్తి కలవారు పోటీలలో పాల్గొని సీటు పొందాలని ఎంపిడిఒ ఆర్.శ్రీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైఎస్‌ఆర్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్ కడప నందు 4,5వ తరగతి ప్రవేశాల కొరకు 40 సీట్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని ప్రాథమిక పాఠశాలల్లోని నాలుగు, అయిదు తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంపిక పోటీలలో పాల్గొనవచ్చన్నారు.










