Aug 14,2023 23:46

ప్రజాశక్తి - నిడదవోలు
దేశంలో మహిళల పై దాడులు, హింస అరికట్టాలని కెవిపిఎస్‌, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో జెంట్రీ టైలర్స్‌ నేతత్వంలో తయారీ చేసిన 750అడుగుల జాతీయ పతాకంతో నిడదవోలు పట్టణంలో సోమవారం ప్రదర్శన నిర్వహించారు. కవిపిఎస్‌ తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర వచ్చిన 77ఏళ్ల తర్వాత కూడా లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంలో మహిళలపై దాడులు, కులవివక్ష, ఉన్మాదం వంటివి మన దేశంలోనే చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు.
యువకులు, విద్యార్థులు, తమ దేశ భక్తిని చాటుకుంటూ భారత్‌ మాతాకి జై, మహిళలు, చిన్నారులౖ అఘాయిత్యాలను అరికట్టాలని మత సామరస్యం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ప్రదర్శన పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌ నుంచి పాటిమీద గణేష్‌ చౌక్‌ వరకు ప్రదర్శన కొనసాగింది. కార్యక్రమంలో కెవిపిఎస్‌ రాష్ట్ర నాయకులు జువ్వల రాంబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాంబాబు, భాస్కర్‌, తూరుగోపు నాని, సిఐటియు నాయకులు గంటి కష్ణ, డివైఎఫ్‌ఐ నాయకులు గారపాటి ప్రసన్న కృష్ణ, మాజీ సైనికులు వారియర్స్‌ జిమ్‌ అధినేత బొచ్చా కష్ణా, దళిత మహా సభ నాయకులు పిల్లి సురేష్‌, దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు చోళ్ళ రాజు, కెవిపిఎస్‌ నాయకులు నల్లా లెనిన్‌, మిక్కిలి అనిల్‌ కుమార్‌ ఆటో యూనియన్‌ నాయకులు ఎల్లే కష్ణం రాజు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
మణిపూర్‌లో ఘటనలకు నిరసన
కొవ్వూరు రూరల్‌: మణిపూర్‌ రాష్ట్రంలో జరిగినటువంటి అవమానవీయమైన ఘటనను నిరసిస్తూ అక్కడి ప్రజలకు శాంతి నెలకొల్పాలని కోరుతూ వేములూరు గ్రామంలోని పాస్టర్లు, మరియు స్థానిక మానవతా వాదుల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 400 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని స్థానిక నాయకులు మరపట్ల కళాధర చక్రవర్తి ప్రారంభించి మాట్లాడారు. వేములూరులో ప్రారంభమయ్యిన శాంతి ర్యాలీ తొగుమ్మి గ్రామం వరకు నిర్వహించారు. మానవ హక్కులు కాపాడండి, మణిపూర్‌ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పండి అని పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. కార్యక్రమంలో జ్కెభీమ్‌ యూత్‌ సభ్యులు వారా మలాకీ, మానవతావాదులు ఇమ్మానిశ్రీను, విజరుబాబు తదితరులు ప్రసంగించారు. తొగుమ్మి సేవకులు సంఫ్నీభావంగా పాల్గొన్నారు. గోకవరం: మండల కేంద్రమైన గోకవరంలో ఇమ్మానుయేలు పాస్టర్‌ ఫెలోషిప్‌ ఆధ్వర్యంలో మణిపూర్‌ రాష్ట్రంలో జరిగిన ఘటనలకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని సోమవారం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ నుండి ఎంట్రన్స్‌ గేటు వరకు శాంతి ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. కార్యక్రమం లో సుమారు 200 మంది పాస్టర్స్‌ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం రీజనల్‌ ఛైర్మన్‌ టి.ప్రభు దాసు, పాస్టరు, ఎమ్‌ఆర్‌పిఎస్‌ నాయకులు పాల్గొన్నారు.