ప్రజాశక్తి-యంత్రాంగం మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజమహేంద్రవరం సత్యం, అహింసలే ఆయుధంగా భారత దేశానికి స్వాతంత్య్రయం సముపార్జించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. స్పందన హల్లో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెసి ఎన్.తేజ్ భరత్, డిఆర్‌ఒ జి.నరసింహారావు పాల్గొన్నారు. పెరవలి మండల కార్యాలయంలో ఎంపిడిఒ ఎస్.రమేష్, ఎంపిపి కార్చెర్ల సీతారామప్రసాద్ నివాళుర్పించారు. ఉండ్రాజవరం మండల కార్యాలయంలో ఎంపిపి పాలాటి యల్లారీశ్వరి, చివటం సచివాలయంలో సర్పంచులు ఈడుపుగంటి సత్యనారాయణ, మెండే వెంకట్రావు, బొక్కా శ్రీనివాస్, బూరుగుపల్లి సుబ్బారావు పాల్గొన్నారు. గోకవరం మండల కార్యాలయంలో ఎంపిడొ కెవిఎస్‌ఎస్‌ఎస్ మూర్తి, ఎంపిపి సుంకర శ్రీవల్లి, సుంకర వీరబాబు నివాళులర్పించారు. నిడదవోలులో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గాంధీజీకి నివాళులర్పించారు. కమిషనర్ కెవి.పద్మావతి, సభ్యులు పాల్గొన్నారు. పాటిమీద గాంధీ విగ్రహంవద్ద సిపిఎం నాయకుడు జువ్వల రాంబాబు ఘనంగా నివాళులు అర్పించారు. రసూల్, సురేష్, సత్యనారాయణ పాల్గొన్నారు. తాళ్లపూడి బస్టాండ్ సెంటర్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి అరిగెల అరుణ కుమారి, గెడ్డం సాయిబాబా, పాలకుర్తి ప్రభాకర్ చౌదరి, అందే నాగభూషణం, బండి రాంబాబు, కె.శ్రీను, జి.జాన్, ఎస్.మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.










