ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం రూరల్ వేమగిరిలో ఈ నెల 27, 28 తేదీల్లో జరిగే టిడిపి మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ ముఖ్య నాయకులు కసరత్తు చేస్తున్నారు. స్థానిక మోరంపూడి సెంటర్‌లో ఉన్న గన్నీస్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో ఆ పార్టీ నాయకులు ఈ మేరకు బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎంఎల్‌సి పరుచూరి అశోక్‌బాబు, మాజీ ఎంఎల్‌ఎలు జ్యోతుల నెహ్రూ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆరుమిల్లి రాధాకృష్ణ, పార్టీ కార్యాలయ కార్యదర్శి రమణ, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్, వెలుగుబంటి ప్రసాద్, మరుకుర్తి రవియాదవ్, కోరుమిల్లి విజయశేఖర్, సంసాని ప్రసాద్, వలవల బాబ్జి తదితరులు పాల్గొన్నారు. మహానాడు నిర్వహణా కమిటీల పనిపై చర్చించారు. మహానాడు నిర్వహణ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్ల విషయంలో ఎవరూ అలసత్వం వహించరాదని, విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.










