Feb 03,2023 22:49

ప్రజాశక్తి -దేవరపల్లి మానవత స్వచ్ఛంద సేవ సంస్థ, ఏలూరు ఆశ్రమ్‌ ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యాన దేవరపల్లిలోని కేశిరాజు వెంకట రాజు, పాలకోడేటి వీర్రాజు కళ్యాణ మండపంలో మెగా శిబిరాన్ని శుక్రవారం ప్రముఖ వైద్యులు డాక్టర్‌ కేశిరాజు కాశీ విశ్వనాథ్‌ ప్రారంభించారు ఈ వైద్య శిబిరానికి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆశ్రమ్‌ హాస్పిటల్‌ వైద్యులు 10 విభాగాలు ఏర్పాటు చేసి విశేష సేవలందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆశ్రమ్‌ హాస్పిటల్‌ పిఆర్‌ఒ మాట్లాడుతూ దేవరపల్లి మండలంలో మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలు గురించి వివరించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మానవత మండల అధ్యక్షులు బండి సూర్య ప్రకాష్‌ రావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా హెల్త్‌ డైరెక్టర్‌ బలుసు సత్యనారాయణ మాట్లా డుతూ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా కార్యవర్గ సభ్యులు బల్ల సూర్యచక్రం, కేసిరాజు వెంకట రాజ్‌ కుమార్‌, కేశిరాజు సీతారామయ్య, పప్పు వెంకట రామారావు, నారాయణ, విశ్వేశ్వరరావు, ఎంపిటిసి సత్తి జగదీశ్వరరెడ్డి, ఈడ్పుగంటి నాగేశ్వరరావు, తీగల రాజా, మాధవరపు వెంకటేశ్వరరావు, పచ్చ రామ్‌గోపాల్‌, చీకట్ల వెంకటరావు పాల్గొన్నారు.