ప్రజాశక్తి - ధవళేశ్వరం
కార్మికులంతా మేడేలో పాల్గొనాలని, వాడ వాడలా ఎర్రజెండాలను ఎగురవేసి వారోత్సవాలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్ పిలుపునిచ్చారు. ధవళేశ్వరం సిఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు అధ్యక్షతన జరిగిన మేడే సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడేను కార్మికులంతా విజయవంతం చేయాలన్నారు. ఎందరో కార్మికులు పోరాటాల నుంచి పుట్టిందే మేడే అని అన్నారు. మేడే పోరాట స్ఫూర్తితో ప్రపంచంలో కార్మికులు 8గంటల పని విధానం, కనీస వేతనాలు, కార్మికుల సౌకర్యాలు సాధించుకున్నారన్నారు. ప్రస్తుతం పెట్టుబడిదారీ దేశాల ఆర్థిక మాంద్యం కారణంగా కార్మికుల హక్కులు, సౌకర్యాలు పాలకులు పెట్టుబడిదారుల లాభాలు కోసం కోతపెడుతున్నారన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న తరుణంలో జరుగుతున్న మేడేను కార్మికులు పెద్దఎత్తున పాల్గొని పాలకుల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను త్రిప్పికొట్టలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రాజులోవ, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా కార్యదర్శులు ఎస్‌ఎస్.మూర్తి, కర్రి రామకృష్ణ, వై.బేబిరాణి, కె.పోసమ్మ, కె.అన్నామణి, జిల్లా కమిటీ సభ్యులు బి.పవన్, టి.సుబ్బలక్ష్మి, శంకర్,సత్యనారాయణ, సాగర్, తదితరులు పాల్గొన్నారు.










