Mar 24,2023 22:50

ప్రజాశక్తి-నిడదవోలు నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పక్కన మద్యం దుకాణానికి ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని పట్టణ ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జువ్వల రాంబాబు డిమాండ్‌ చేశారు. నిత్యం రద్దీగా ఉండే హాస్పిటల్స్‌, బస్‌ స్టాండ్‌ దగ్గర మద్యం దుకాణం ఎలా ఏర్పాటు చేస్తారని రాంబాబు ప్రశ్నించారు. నిబంధనలకు విర్ధుంగా అనుమతులు ఇచ్చిన దుకాణాన్ని వెంటనే తొలగించకపోతే ప్రజలే తొలగిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాని, లెనిన్‌, నాగేంద్ర యువకులు పాల్గొన్నారు.