Feb 11,2023 23:46

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్‌ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 15 కోర్టులలో ఏర్పాటు చేసిన 43 బెంచ్‌ల ద్వారా రాత్రి 9 గంటల వరకూ నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో 24,405 కేసులను పరిష్కరించినట్టు జిల్లా జడ్జి కె.సునీత తెలిపారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.సునీత మాట్లాడుతూ కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో చివరి కేసును కూడా పరిష్కరించేందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు పని చేస్తామన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్‌అదాలత్‌లపై మరింత అవగాహన పెంచాలని పేర్కొన్నారు. ఎస్‌సి, ఎస్‌టి కోర్టు జడ్జి ఎం.నాగేశ్వరరావు, సీనియర్‌ జిల్లా జడ్జి కె.ప్రత్యూష కుమారి, డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ, బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఐ.శివప్రసాద్‌, న్యాయవాదులు జి.కష్ణకపూర్‌, టి.గారహి పాల్గొన్నారు. లోక్‌ అదాలత్‌లో ి34 క్రిమినల్‌ కేసులు 40 సివిల్‌ తగాదాలు పరిష్కరించినట్లు నిర్వహించినట్లు కొవ్వూరు 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి.అన్నపూర్ణ తెలిపారు. బెంచ్‌ ఆఫీసర్లుగా ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.ధర్మారావు,మరియు సెకండ్‌ అడిషనల్‌ జుడిశియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజి స్ట్రీట్‌ కే.శారదాంబ తనతోపాటు బెంచ్‌ ఆఫీసర్స్‌ వ్యవహరించినట్లు జిల్లా జడ్జి పి.అన్నపూర్ణ తెలిపారు. బీమా కంపెనీలు, పోలీస్‌, ప్రభుత్వ రంగ సంస్థల, బ్యాంకుల సహకారంతో జిల్లాలో జాతీయ లోక్‌ అదాలత్‌ను చక్కగా నిర్వహించడం సాధ్యం అయిందని ఆమె పేర్కొన్నారు.