Jan 30,2023 22:41

ప్రజాశక్తి-యంత్రాంగం కుష్టు వ్యాధి నిర్మూలనపై అవగాహన పక్షోత్సవ కార్యక్రమాలను జిల్లావ్యాప్తంగా సోమవారం నిర్వహించారు. రాజమహేంద్రవరం కుష్టు వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత పేర్కొన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనపై ఈ నెల 30వ తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జిల్లాలో వైద్యాధికారులు వారి సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పలువురు కుష్టు వ్యాధిగ్రస్తులకు స్టీలు బిందెలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టిబి కంట్రోల్‌ అధికారి డాక్టర్‌ ఎన్‌.వసుంధర మాట్లాడుతూ కుష్టు వ్యాధిని సులభంగా గుర్తించ వచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెసి ఎన్‌.తేజ్‌ భరత్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు పాల్గొన్నారు. గోకవరం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ కొమరం శ్రావణి అధ్యక్షతన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జెడ్‌పిటిసి దాసరి శ్రీరంగ రమేష్‌, ఎంపిపి సుంకర శ్రీవల్లి వీరబాబు, ఎంపిహెచ్‌ఇఒ వైఎస్‌.రాయుడు, సిహెచ్‌ఒ మేరీ కృప పాల్గొన్నారు. చాగల్లు బ్రాహ్మణగూడెం పిహెచ్‌సిలో వైద్యాధికారి డాక్టర్‌ పిఆర్‌ఎల్‌.దేవి, సర్పంచ్‌ గురివెళ్లి కుమారి, ఎంపిటిసి ప్రత్తిపాటి వెంకటేశ్వరరావు, ఆరోగ్య విస్తరణాధికారి సిహెచ్‌.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. చాగల్లు గ్రామలో సర్పంచ్‌ ఉన్నమట్ల మనశాంతి, వైద్యాధికారి డాక్టర్‌ తనూజ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిహెచ్‌ఎన్‌ ఎంజెవి.రత్నకుమారి, ఎంపిహెచ్‌ఎస్‌ ఎం,డివి.రమణ మూర్తి పాల్గొన్నారు.