ప్రజాశక్తి-నల్లజర్ల, నిడదవోలు, పెరవలి రాష్ట్రంలో రాక్షస పాలనతో అభివృద్ధి కుంటుపడిందని టిడిపి గోపాలపురం నియోజకవర్గం ఇన్‌ఛార్జి మద్దిపాటి వెంకటరాజు అన్నారు. గురువారం అనంతపల్లిలో పార్టీ మండల అధ్యక్షులు తాతిన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యాక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైసిపి పాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ మీరా సాహెబ్, కూచిపూడి ఉదయ భాస్కరరావు, రాజా సూరిబాబు రాజు, జమ్ముల వీర వెంకట సతీష్, ఎలమాటి శ్రీనివాసరావు, పసుమర్తి సతీష్, యద్దనపూడి బ్రహ్మరాజు, బేతిన సత్యనారాయణ, మద్దిపాటి సుబ్బారావు పాల్గొన్నారు. ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రాభివద్ధి కుంటు పడుతోందని మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు అన్నారు. గురువారం శింగవరంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు వెలగన సూర్యారావు, మండల ప్రధాన కార్యదర్శి పంచదార దుర్గా ప్రసాద్, పెన్మత్స ఆంజనేయరాజు, ప్రవీణ్ వర్మ, ఆతుకూరి సూర్యారావు, జమ్ము సత్యనారాయణ, పత్తిక మోహన్ బాబు, గుణ్ణంపల్లి వెంకట దాసు పాల్గొన్నారు. పెరవలిలో టిడిపి నేతలు ప్రతి ఇంటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సలాది కష్ణమూర్తి, బొడ్డు రామాంజనేయులు, ననుబోలు రాధాకృష్ణ, తులపాకు నాగరాజు, పేర్ల నాగులు, ముసునూరి భద్రం, తలపాకుల సత్తిబాబు పాల్గొన్నారు.










