నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న కుడుపూడి సూర్యనారాయణరావు
ప్రజాశక్తి - కాకినాడ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానానికి వైసిపి అభ్యర్థిగా కుడిపూడి సూర్యానారాయణ మంగళవారం నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను కాకినాడ కలెక్టరేట్‌లోని రిటర్నింగ్ అధికారి, కాకినాడ జెసి ఇలాక్కియాకు అందించారు. ఆయన డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సూర్యనగర్‌కు చెందిన వారు. ఆయన వెంట మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంఎల్‌ఎ పొన్నాడ వెంకటసతీష్ కుమార్, ఎంఎల్‌సి తోట త్రిమూర్తులు, జడ్‌పి చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఉన్నారు.










