విజేతలతో ఎంపిపి ప్రసాద్ తదితరులు
ప్రజాశక్తి- కడియం
విశాఖపట్నంలో జపాన్ షాట్ కాన్ సంస్థ అధ్వర్యంలో జరిగిన నేషనల్ కరాటే పోటీల్లో కడియం విద్యార్థులు పతకాల పంట పండించారు. పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చారు. కె.లోకేష్, బి.కుమార్ రాజా, జి.దివ్యశ్రీ, కె.పర్ణిక, ఆర్.ఆదిత్య ప్రథమ స్థానంలో స్వర్ణ పతకాలు సాధించగా కె.హర్షిత కావ్య సిహెచ్. చైతన్య, కే.వినరు, ఆర్.రోహిత్ ద్వితీయ స్థానంలో వెండి పతకాలు పొందారు. జి.సంవిత, యు.వీర సాయి, ఆర్.కౌశిక్ తతీయ స్థానంలో కాంస్య పథకాలు సాధించారని కోచ్ కొప్పిశెట్టి జానకిరామ్ తెలిపారు. వీరిని ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్, టిడిపి మండల అధ్యక్షుడు నాని అభినందించారు.










