ప్రజాశక్తి - యంత్రాంగం
రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిన చంద్రబాబు నాయుడికి ప్రజలు అండగా నిలవాలని టిడిపి నేతలు కోరారు. స్థానిక 14వ డివిజన్‌లో 'బాబుతో నేను' కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. డివిజన్‌లోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్‌లోని ప్రతి షాపునకు వెళ్లి ప్రజలను కలిసి 'బాబుతో నేను' కరపత్రాలు అందచేసి, చంద్ర బాబుపై జరుగుతున్న కుట్రలపై ప్రజల అభిప్రా యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు గన్ని కష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, చిల్లా రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రతిక్షణం పరితపించే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టిన జగన్మోహనరెడ్డి పాల నకు చరమగీతం పాడి ప్రజలు చంద్రబాబుకి అండగా నిలవా లని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కుడుపూడి సత్తిబాబు, రెడ్డి మణేశ్వరరావు, బుడ్డిగ రాధా, జానకిరామయ్య, యిన్నమూరి రాంబాబు, కప్పల వెలుగు కుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఉండ్రాజవరం చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి నాయకుడు కుందుల వీర వెంకట సత్యనారాయణ దీక్షకు తణుకు మాజీ ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ సంఘీ భావం తెలిపారు. గత నాలుగు రోజులుగా నియోజక వర్గంలోని వివిధ ప్రాంతాల్లో నిరాహార దీక్షలు కొనసాగు తున్నాయి. మండలంలోని పాలంగిలో కందుల ఆధ్వర్యంలో జరుగుతున్న శిబిరాన్ని ఆయన సందర్శించారు. వేలివెన్నులో మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు ఇంటి వద్ద నిరాహార దీక్ష కొనసాగుతోంది. కడియం బొమ్మూరు నాలుగో రోజు దీక్షలు కొనసాగాయి. మాధవ రాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ (చంటి) ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, నిరాహార దీక్షా శిబిరం దగ్గరకు చేరుకుని మద్దతు తెలిపారు.










