ప్రజాశక్తి - యంత్రాంగం
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి శ్రేణులు విరామం లేకుండా నిరసన కార్యక్రమా లను చేపడుతున్నారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులో జరుగుతున్న టిడిపి రిలే నిరహారదీక్షలు ఎస్‌సి విభాగం ఆధ్వర్యంలో 14వ రోజు కొనసాగాయి. ఈ కార్యక్ర మంలో మాజీ మంత్రులు కెఎస్ జవహర్, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, నగర టిడిపి అధ్యక్షుడు రెడ్డి మణేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపి జివి హర్షకుమార్, మాజీ ఎంఎల్‌సిలు వివి చౌదరి, అంగర రామ్మోహన్, మాజీ మేయర్ పావని, అమరావతి దళిత జేఎసి ఛైర్మన్ కొలగపూడి శ్రీనివాస్ దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. టిడిపి నగర వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నగరంలోని మెయిన్ రోడ్‌లో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ప్రతి దుకాణానికి వెళ్ళి కరపత్రం అందించి చంద్రబాబుపై జరుగుతున్న కుట్రలను వివరించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి తవ్వా రాజా, నగర అధ్యక్షులు రామినేని మస్తాన్ చౌదరి, పార్టీ నాయకులు నిమ్మలపూడి గోవింద్, తదితరులు పాల్గొన్నారు. టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు తెరపల్లి సాయి దీపక్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కడియం ఎంపిపి వెలుగుబంటి ప్రసాద్ సారధ్యంలో జరుగుతున్న రిలే నిరహారదీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి కళా వెంకట్రావు, ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొని సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును వారు తీవ్రంగా ఖండిం చారు. చాగల్లు ఊనగట్ల గౌడ సంఘం అభయాం జనేయ స్వామి గుడి వద్ద టిడిపి నాయకుడు బొల్లిన శివ నాగేంద్ర ఆధ్వర్యంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరారు. ఈ కార్య క్రమంలో టిడిపి నాయకులు సూరపని చిన్ని, ఆళ్ళ హరిబాబు, కేతా సాహెబ్, నాదెళ్ళ నాని, దొంగ రామక్రిష్ణ, మద్దిపట్ల సురేష్, పెనుమర్తి కిషోర్, రేలంగి శ్రీను, పాల్గొన్నారు. బ్రాహ్మణగూడెం నుంచి నిడదవోలు మండలం తిమ్రా జుపాలెం కోట సత్తెమ్మ గుడి వరకు కాగడాల ప్రదర్శన చేశారు. గారపాటి కాశీ, వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆళ్ల హరిబాబు, ఆళ్ల ఇందిరా రాణి, నాదెల శ్రీరామ్ చౌదరి, సూరపునేని చిన్ని, గారపాటి శ్రీదేవి, పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.










