ప్రజాశక్తి - యంత్రాంగం
చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రిలే నిరహారదీక్షలు నిర్వహిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో కొవ్వొత్లు ర్యాలీలు, నిరసన ర్యాలీలు జరిగాయి. పలు దేవా లయాల్లో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. రాజమహేంద్రవరం టిడిపి అర్బన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ సెంటర్ సమీపంలోని రేణుక అపార్ట్‌మెంట్స్ పక్కన రిలే నిరహారదీక్షను చేపట్టారు. ఈ దీక్షకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, అర్బన్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నగర అధ్యక్షులు వై.శ్రీను సంఘీభావం తెలిపారు. టిడిపి నాయకులు గన్ని కష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాస్, యర్రా వేణు గోపాలరాయుడు, వర్రే శ్రీనివాసరావు, చిల్లా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా 'స్కిల్' స్కామ్ పేర టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేయడాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. దీక్షలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా సంతకాలు చేశారు. టిడిపి నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా సంయుక్త పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమం జరిగింది. సీతానగరం రాజానగరం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ బొడ్డు వెంకటరమణచౌదరి ఆధ్వర్యంలో సీతానగరంలో మహిళలు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. సీతానగరం జివికె కన్వెన్షన్ వద్ద సామూహిక రిలే నిరాహారదీక్ష కార్యక్రమంలో బొడ్డు జగన్మోహిని, మహిళలు, టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బాబు కోసం నేను సైతం అంటూ పోస్టర్‌పై సంతకాలు చేశారు. అనంతరం పోస్టు కార్డులను రాసి, చంద్రబాబుకు మద్దతు తెలిపారు. సిఎం జగన్‌ను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉండ్రాజవరం చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 8వ రోజుకు చేరుకున్నాయి. టిడిపి నాయకులు కుందుల వీరవెంకట సత్యనారాయణకు, రాష్ట్ర సర్పంచుల ఛాంబర్ రాష్ట్ర కార్యదర్శి, తాడిపర్రుసర్పంచ్ కరుటూరి నరేంద్రబాబు మద్దతు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో మాజీ ఎంఎల్‌ఎ బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. పలు గ్రామాల నుంచి టిడిపి అభిమానులు పాల్గొని మద్దతు ఇచ్చారు. తాళ్లపూడి మండలంలో మలకపల్లిలో చేపట్టిన దీక్షకు మాజీ ఎంఎల్‌ఎ జనసేన అధినేత టివి.రామారావు మద్దతు తెలిపారు. దీక్షలో కూర్చున్నారు. ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద దీక్షా శిబిరం వేసేందుకు సిద్ధం కాగా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టిడిపి నాయకుడు కె.రాంబాబు ఇంటి వద్ద నిరాహార దీక్షను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బిసి నాయకులు చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు గంటా కృష్ణ ఆధ్వర్యంలో కొవ్వూరులోని టిడిపి నిరాహార దీక్షా శిబిరం వరకూ ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. నల్లజర్లలో చేపట్టిన నిరహారదీక్షలో జడ్‌పి మాజీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, జనసేన పార్టీ కన్వీనర్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంఎల్‌ఎ ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. బాబు బయటకు వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. అనంతరం నల్లజర్ల సెంటర్ నుంచి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొయ్యలమూడి సుధారాణి, తాతిన సత్యనారా యణ, ఏలేటి సత్యనారాయణ, అచ్యుత సత్యనారాయణ, అల్లాడ రాజారావు పాల్గొన్నారు.










