ప్రజాశక్తి- రాజమహేంద్రవరం
ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర మంగళవారం 2 వ రోజు స్ధానిక బిసి బార్సు హాస్టల్ లో ప్రారంభమై అయ్యి వివిధ విద్యా సంస్థలకువెళ్లింది.ఈ సైకిల్ యాత్రలోఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షు, కార్యదర్శిలు వి. రాంబాబు, ఎన్.రాజా మాట్లాడుతూ జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వచ్చి స్కూల్స్ మూసేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్నారని అన్నారు. అలాగే సన్నబియ్యం ఇస్తాం సన్నబియ్యంతో విద్యార్థులకు భోజనం పెడతామన్న సిఎం జగన్ విద్యార్థులకు లావు బియ్యంతో భోజనం పెడుతున్నారని అన్నారు. అయితే ఆ భోజనాన్ని విద్యార్థులు తినలేక అనేక మంది ఇబ్బంది పడుతూ ఇంటి నుంచే భోజనం తెచుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుంచి టీచర్ పోస్టులు భర్తీ చెయ్యట్లేదని వెంటనే డిఎస్‌సి ప్రకటించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీసుకు వచ్చిన జిఒ 77 వల్ల అనేకమంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని చెప్పారు. అది ప్రభుత్వ వైఫల్యం వల్లనే జరుగుతుందని తెలియజేశారు. సైకిల్ యాత్ర కంటిపూడి రామారావు, నెహ్రూ నగర్, టౌన్, నన్నయ మున్సిపల్ స్కూల్స్, మాతశ్రీ కళాశాల, ప్రగతి కళాశాల, ఆర్ట్స్ కళాశాల వద్ద, బిసి, ఎస్‌టి బాలికల కళాశాల హాస్టల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయక కార్యదర్శి వై.భాస్కర్ జిల్లా కమిటీ సభ్యులు రాజేష్ జోసెఫ్, మహేష్ మరియు రాజమహేంద్రవరం నగర నాయకులు జ్యోతిర్మయి, దుర్గా, రాజేష్, భాష, కనక అచ్చారావు, శశి, వైష్ణవి, మరియా, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










