ప్రజాశక్తి-కడియం మనకు కుండీల్లో ఉండే కమలా మొక్కలు అరుదుగా కనపడతాయి. అక్కడక్కడా అందం కోసం ఈ మొక్కలు పెంచుకున్నప్పటికీ పది నుండి పాతిక కాయలు ఉండటం విశేషం. అలాంటిది చైనా నుండి దిగుమతి చేసుకున్న కుండీల్లో ఉండే ఒక్కో మొక్కకు వందల సంఖ్యలో కమలాలుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మండలంలోని కడియపులంక శివాంజనేయ నర్సరీలో ప్రస్తుతం ఆ అరుదైన కమలా మొక్కలు సందడి చేస్తున్నాయి. మంచి దిగుబడే కాక అలంకరణలో ముందుండే ఈ మొక్కలను కార్పొరేట్ సంస్థలు, ఫంక్షన్ హాల్స్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు కొనుగోలు చేసి తీసుకెళ్లుతున్నారు.










