ప్రజాశక్తి-రాజమహేంద్రవరం కందుకూరి వీరేశలింగం 104వ వర్థంతి సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల బందం శనివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి బి.పవన్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా మాట్లాడారు. కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘసంస్కర్త అని ఆయన స్త్రీ విద్య కోసం కషి చేసిన వ్యక్తి అని చెప్పారు. సొంత ఆస్తిని సైతం సమాజం కోసం పంచిన మహనీయుడని కొనియాడారు. విద్యార్థులు, నేటి యువతరం అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కందుకూరి ఆశయాలను కాపాడాలని తెలిపారు. విద్యావ్యాప్తి కోసం కందుకూరి తన ఆస్తిని, జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఆయనకు నివాళులు అర్పించడం అంటే కందుకూరి విద్యాసంస్థలను అభివృద్ధి చేయాలన్నారు. విద్యాసంస్థలకు నిధులు కేటాయించి అభివృద్ధి చెయ్యాలన్నారు.










