పరిహారం కోసం రైతుల ఆందోళన
ప్రజాశక్తి - తాళ్లపూడి
కల్తీ కలుపు మందు కారణంగా పంటలను కోల్పోయామని, తమకు తమకి నష్టపరిహారం అందజేయాలని రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని మలకపల్లి పెద్దేవం గ్రామానికి చెందిన 20 మంది రైతులు స్థానిక సొసైటీలో నోవికేసిడ్ అనే కలుపు మందు కొనుగోలు చేశారు. పొలాల్లో పిచికారీ చేశారు. ే ఈ మందు కారణంగా కలుపు మొక్కలు బదులు పంట ఎండిపోయిందని రైతులు తెలిపారు. వారు మలకపల్లి సొసైటీ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. సుమారు 170 ఎకరాల్లో ఈ విధమైన పరిస్థితి నెలకొందని గాజుల శ్రీనివాస్, చెరుకూరి మోహన్ తదితర రైతులు తెలిపారు. సంబంధిత ఫ్యాక్టరీ ప్రతినిధులను నిర్బంధించారు. యాజమాన్యంతో మాట్లాడి నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. ఈ విషయంపై మండల వ్యవసాయ శాఖ అధికారి రుచిత మాట్లాడుతూ ఫిర్యాదు అందిందని పరిశీలిస్తున్నామని తెలిపారు.










