ప్రజాశక్తి - రాజమహేంద్రవరం
ఎపి జెఎసి నాయకుల బృందం శనివారం కలెక్టర్ కె.మాధవీలతనుకలిసి సమ్మె నోటీసు అందించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ ఛాంబర్‌లో వారు కలెక్టర్‌ను కలిశారు. ఉద్యమ కార్యాచరణను వివరించి, సహకరించాలని కోరారు. అలాగే జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల అధికారులను కలిసి ఉద్యమ కార్యాచరణ వివరించారు. నగరంలో, డివిజన్, మండల కేంద్రాల్లో వివిధ శాఖల ఉద్యోగులను కలిసి కరపత్రాలు పంచారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎపి జెఎసి అమరావతి ఛైర్మన్ ఎం.కాంతిప్రసాద్, ఎపిఆర్‌ఎస్‌ఎ జిల్లా అధ్యక్షులు గొలుగూరి బాపిరాజు, జిల్లా ట్రెజరర్ వి.శ్రీనివాస్, రాజమహేంద్రవరం డివిజన్ అధ్యక్షులు సిహెచ్.సురేష్‌బాబు తదితరులున్నారు.










