Feb 26,2023 23:53

కళాకారులతో ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా

ప్రజాశక్తి-కోరుకొండ
కళాకారులను ప్రోత్సహించడంలో, వారికి అండగా నిలబడటంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందంజలో ఉంటుందని రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా అన్నారు. శ్రీరంగపట్నంలో ఆదివారం జరిగిన శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి రథోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం రథోత్సవంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో ఒక కార్యక్రమానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన, తీవ్రంగా గాయపడిన శ్రీరంగ పట్నం కళాకారుల పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లానని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల వంతున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష వంతున సాయం అందించేందుకు ముఖ్య మంత్రి అంగీకరించారని తెలిపారు. త్వరలోనే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే శ్రీరంగపట్నం లోని పంచాయతీ, నేతల సహకారంతో కళాకారుల సౌకర్యార్థం ఒక భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దాల రమణ, సూరిశెట్టి భద్రం, సూరిశెట్టి అప్పలస్వామి, కోయిడాల నానాజీ, విఎల్‌వి.శివ, అత్తిలి రామ్‌ప్రసాద్‌, తనకాల నూకరాజు తదితరులు పాల్గొన్నారు.