ప్రజాశక్తి-కొవ్వూరు రూరల్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన వార్షిక డైరీనీ బుధవారం కొవ్వూరు ఆర్‌డిఒ ఎస్.మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లిబాబు మాట్లాడుతూ దేశంలో కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయులు జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బిఆర్.అంబేడ్కర్, గుర్రం జాషువా, పుచ్చలపల్లి సుందరయ్య చిత్రాలతో డైరీ ఆవిష్కరణ స్ఫూర్తిదాయకం అన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు జువ్వల రాంబాబు మాట్లాడుతూ ప్రతినెల సివిల్ రైట్స్ డే దళిత పేటల్లో జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం నాయకుడు పెనుమాక జయరాజు, బొంతా శ్యామ్, రవి ప్రకాష్, దళిత సంఘాల నాయకులు శాకా పుల్లారావు, గాడి ఆదినారాయణ, కొడమంచిలి సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.సుందరబాబు, తాళ్లపూడి తహశీల్దారు టి.రాధిక పాల్గొన్నారు.










