ప్రజాశక్తి-రాజమహేంద్రవరం
ప్రజలపై ఎడాపెడా ధరలు, పన్నులు, ఛార్జీలు భారం మోపుతున్న కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నారనిసిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్
అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం రాష్ట్ర వాప్తంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రాజమహేంద్రవరంలో కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న 35వ, 36వ, 37వ వార్డు సచివాలయంలో సిపిఎం నాయకుల బృందం వార్డు సచివాలయం అడ్మిన్ కార్యదర్శులకు వినతిపత్రం ఇచ్చారు. ప్రధాన డిమాండ్‌లుగా ప్రజలపై నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, చదువుకున్న యువతకు తక్షణమే ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చెయ్యాలని, ప్రజలపై విద్యుత్ చార్జీలు, సర్దుబాటు ఛార్జి, ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని ప్రజల వద్ద సేకరించిన సంతకాలతో కూడిన వినతిపత్రంను అందించారు. ఈ సందర్బంగా సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్ మాట్లాడుతూ సంతకాల సేకరణ లో ప్రజలు స్వచ్చందంగా పాల్గొన్నారని, పెరుగుతున్న ధరలపై తీవ్రమైన అసంతప్తి తెలిపారని అన్నారు. ప్రజలపై ఎడాపెడా ధరలు, పన్నులు, ఛార్జీలు భారం మోపుతున్న కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తున్నారని తెలిపారు. పాలకుల తమ వైఖరి మార్చకుంటే ప్రజలే పాలకులను మర్చి బుద్ధి చెబుతారని అన్నారు. సిపిఎం చేపట్టిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమర భేరి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని అన్నారు. సెప్టెంబర్ 4 న మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గున్ని జయప్రదం చేయాలని కోరారు.. ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టేవరకు ప్రజా సమస్యలపై పోరాటాలని కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిపిఎం నగర నాయకులు ఎస్‌ఎస్.మూర్తి, కర్రీ.రామకృష్ణ, అప్పల.నరసయ్య, ఐ.సుబ్రహ్మణ్యం, వి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి
చాగల్లు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, పెరిగిన ధరలు అరికట్టాలని, గ్యాస్ బండను రూ.400లకే ఇవ్వాలని సిపిఎం మండలం కార్యదర్శి కెకె.దుర్గారావు డిమాండ్ చేశారు. శుక్రవారం చాగల్లులో కరపత్రాలను సిపిఎం నాయకులు కరపత్రాలు పంచుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సభ్యులు కంకటాల బుద్ధుడు, గారపాటి సుబ్బారావు పాల్గొన్నారు.
పెరుగుతున్న ధరలు అరికట్టాలి
దేవరపల్లి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, కరెంటు కోతలు నివారించాలని కరెంటు చార్జీలు తగ్గించాలని సిపిఎం నాయకులు ఎస్.భగత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న సమర బేరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని త్యాజంపూడి సచివాలయం వద్ద గ్రామపంచాయతీ కార్యదర్శి కి వినతి పత్రం సమర్పించారు. భగత్ మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలపై తీవ్రమైన విద్యుత్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోపుతోందని అన్నారు. మరోసారి బహుత్తరమైన విద్యుత్ ఉద్యమానికి ప్రజలు సంసిద్ధం కావాలని కోరారు.రైతు నాయకులు నడిగట్ల రామారావు మాట్లాడుతూ వ్యవసాయ మోటార్లకు మీటర్లు వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్యక్రమంలో అయినపర్తి శ్రీనివాసరావు, మర పట్ల మోహన్ కల్యాణ్, గట్టెం నాని పాల్గొన్నారు.










