Feb 18,2023 23:58

ప్రజాశక్తి-కడియం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డిని ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో కడియం సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ నర్సరీ ఫార్మర్స్‌ అసొసియేషన్‌ అధ్యక్షులు పుల్లా సత్యనారాయణ, పాలకవర్గ సభ్యులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కడియం నర్సరీలను ఎకోటూరిజంగా అభివద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రాజెక్టు పెండింగ్‌లోనే ఉందని, దాన్ని కార్యరూపం దాల్చే విధంగా కషి చేయాలని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో కడియం నర్సరీల పర్యటనకు వస్తానని, తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పినట్లు నర్సరీ ప్రతినిధులు తెలిపారు.