ప్రజాశక్తి-కడియం రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా వైసిపి రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని గ్రీనింగ్ బోర్డ్ కార్యాలయంలో చందన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా వైసిపి జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా చందన నాగేశ్వర్, పర్వతవర్ధిని దంపతులను సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనం పెంపొందించడానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. కడియం నర్సరీలకు అనుబంధంగా ఉన్న ఇటువంటి గ్రీనింగ్ బోర్డు పదవి ఇవ్వటం పట్ల ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఎల్‌ఎ చందన రమేష్, వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరజాల బాబు, కడియం మండలం అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్, నాయకులు తాడాల చక్రవర్తి, తాటికొండ విష్ణు, రాజమౌళి, డాక్టర్ వెలుగుబంటి వెంకటాచలం, కార్పొరేషన్ డైరెక్టర్లు భీమిరెడ్డి నాగేంద్ర, దొంతంశెట్టి వీరభద్రయ్య, సొసైటీ చైర్మన్‌లు వెలుగుబంటి అచ్యుతరాం, ఈదర దీన్ దయాల్, తిరుమలశెట్టి శ్రీనివాస్, ఈలి గోపాలం, సర్పంయులు కొండపల్లి పట్టియ్య, బత్తుల నళినీ రాము పాల్గొన్నారు.










