May 30,2023 23:15

కొవ్వూరు నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న నాయకులు, కార్మికులు

ప్రజాశక్తి - యంత్రాంగం
కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాడుతుందని నాయకులు తెలిపారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నాయకులు సిఐటియు పతాకాలను ఆవిష్కరించారు. జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, బిక్కవోలు, దేవరపల్లి, కడియం మండలాల్లో జరిగిన కార్యక్ర మాల్లో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు ఎం.సుందరబాబు, బి. రాజులోవ మాట్లా డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటియు 21 దేశవ్యాప్త సమ్మెలను నిర్వహించిందన్నారు. నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాడు తుందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రయివేటీకరించే విధానాలను తిప్పి కొట్టేందుకు కార్మికులను పోరాటాలకు సన్నద్ధం చేస్తుంద న్నారు. మోదీ ప్రభుత్వం పూర్తిగా కార్మికులను విస్మరించి అదానీ, అంబానీల సేవలో తరిస్తుందని విమర్శించారు. దేశ కార్మిక వర్గం నేడు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు బస్టాండ్‌ సెంటర్‌ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు, ముసలమ్మ గుడి సెంటర్‌ వద్ద సిఐటియు కొవ్వూరు కమిటీ అధ్యక్షులు మద్దుకూరు దొరయ్య సిఐటియు జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం.సుందరబాబు మాట్లాడారు. సిఐటియు ఆవిర్భావం, సిఐటియు చేసిన పోరాటాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిద్దిరెడ్డి బాపిరాజు, ఎం.నాగేశ్వరరావు, కార్పెంటర్‌ నాగేశ్వరరావు, ఎ.శ్రీనివాస్‌, కె.కనకారావు, ఎన్‌.ఈశ్వరరావు, పి.జన్నాథం, కనకారావు, ఎ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.